Peddapally | బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి శంకర్
పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్ ను మరోమారు నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Peddapally | కమాన్ పూర్, జూన్ 30 : పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్ ను మరోమారు నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేస్తానని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి ఐక్యత, అభివృద్ధి కోసం సమిష్టిగా పని చేస్తామని తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో మరోమారు తనకు జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించినందుకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వచర్ల శ్రీను, జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ దాసరి ఉషకు, అలాగే సహకరించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

