CPI | చిగురుమామిడి, మే 2: చిగురుమామిడి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శిగా (సీతారాంపూర్) గ్రామానికి చెందిన నాగెల్లి లక్ష్మారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా బూడిద సదాశివ (ఓగులాపూర్), పైడిపల్లి వెంకటేశం (ముల్కనూరు) కోశాధికారిగా చాడ శ్రీధర్ రెడ్డి (రేకొండ) ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం సీపీఐ మండల సభ మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకటస్వామి హాజరయ్యారు. తనపై నమ్మకంతో మూడోసారి అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని అన్నారు.