Veenavanka | ప్రాణాలకు ప్రమాదం ఉంది.. న్యాయం చేయండి సారూ..!
తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్, దేవేందర్ కోరారు.
- ఉన్నతాధికారులను వేడుకుంటున్న బాధితులు శ్రీనివాస్, దేవేందర్
- వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన
Veenavanka | వీణవంక, ఆగస్టు 11 : తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్, దేవేందర్ కోరారు. వీణవంక మండలంలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన వీరబోయిన శ్రీనివాస్ మంగళవారం విలేకరులతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. పొలం సాగుచేసుకుందామంటే తన తమ్ముడు రవి కరెంట్ డబ్బా ఫ్యూజ్‌లు తీసి, వైర్లు కట్ చేస్తున్నాడని, దీంతో ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నీరులేక నారుమడి ఎండిపోతోందని, నారుపోసి రెండు నెలలు గడుస్తున్నా సాగుకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎస్ఐ ఆవుల తిరుపతిని వివరణ కోరగా భూ తగాదాలు సివిల్ మ్యాటర్ అయినందున జోక్యం చేసుకోలేదని తెలిపారు. కరంట్ డబ్బాలో వైర్లు కట్ చేశారనే ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

