పెద్దపల్లి, సెప్టెంబర్30 : పెద్దపల్లి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా ముత్యాల రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 25న విడుదలైన గ్రూప్ 1ఫలితాలలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం శిరసానగండ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్ 447.5 మార్కులు, 683 ర్యాంక్ సాధించి పెద్దపల్లి జిల్లా ఉపాధి కల్పనాధికారిగా ఎంపికయ్యారు.ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాధపూర్వకంగా కలిసినంతరం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఇంత వరకు విధులు నిర్వహించిన జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.