Vemulawada | వేములవాడ, మార్చి 8: ఏర్పడిన పరిచయం చనువుగా మారడంతో అదే అతనుగా భావించి బ్లాక్ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుండగా యువకుడిని నమ్మించి హత్య చేసిన సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం వివరాలు వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. భూక్య మోహన్ అని యువకుడికి అడవి పద్దిరకు చెందిన బైరి శారదతో పరిచయం ఉండేది. వీరిద్దరు కొంతకాలం స్నేహంగా ఉన్నారని అయితే ఇప్పుడు ప్రస్తుతం శారద పెళ్లి చేసుకొని భర్త శేఖర్ కలిసి ఉంటోంది. వేములవాడ పట్టణంలోని ఆంజనేయ నగర్ లో నివాసముంటు ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సిగా పనిచేస్తుంది. పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకొని మోహన్ శారదను తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే తరచూ పాత ఫోటోలు వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. విసిగిపోయిన శారద భర్త శేఖర్, మరో బంధువు రవీందర్ తో కలిసి మోహన్ హత్యకు పథకం వేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 4న పట్టణంలోని సిద్ధార్థ లాడ్జికి రావాలని మోహన్ కు సూచించిందని తెలిపారు.
దీంతో మోహన్ అక్కడికి రాగా అప్పటికే పథకం ప్రకారం తెచ్చుకున్న తాడుతో మోహన్‌ను ముగ్గురు కలిసి హత్య చేశారు. సదర్ హత్యకు పాల్పడి బైరి శారద, బైరి శేఖర్, రవీందర్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. హత్యకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, తాడు, ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హత్య కేసును చాకచక్యంగా చేదించిన వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు ప్రేమానందం రామ్మోహన్ గౌడ్, పోలీసులు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాస్ లను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ వీరప్రసాద్, ఎస్ఐ, ప్రేమానందం, శ్రీనివాస్ పోలీసులు ఉన్నారు.