kalvasrirampoor | కాల్వశ్రీరాంపూర్, మార్చి 27 : అనారోగ్యంతో మండలంలోని ఇద్దులాపూర్ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న యాలాల సురేష్ (35) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానిక గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా సురేష్ గత కొంత కాలంగా పనిచేస్తున్నాడు. కాగా ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో అతడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. సురేష్ మృతి చెందడం వల్ల పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్లైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మృతుడి కుటుంబాన్ని దాతలు స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడికి భార్య స్రవంతితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.