Devunipalli | పెద్దపల్లి రూరల్, నవంబర్ 3 : పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో గల శ్రీ లక్ష్మినృసింహ స్వామిని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి, దేవునిపల్లి, పెద్దకల్వల గ్రామాలను సోమవారం సందర్శించిన ఎంపీడీవో పారిశుధ్య పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆయా కార్యక్రమాల్లో దేవునిపల్లి ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య, పంచాయతీ కార్యదర్శులు దేవరనేని నిశాంత్ రావు, ఆవుల అఖిల, మడుపు గీతావాణి, మాజీ ఉప సర్పంచ్ బొక్కల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.