కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో సముచిత స్థానం లభించింది. కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో ఆయనను హోం శాఖ సహాయ మంత్రి పదవి వరించింది.
జిల్లాకు ఈ పదవి రావడం ఇది రెండో సారి. ఇంతకు ముందు అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో బండి సంజయ్‌కి ఇది పోర్ట్ పోలియోను కేటాయించారు. కాగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్‌షాకు మరోసారి బాధ్యతలు అప్పగించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవికి ఎంతో ప్రాధాన్యత ఉండడంతో బీజేపీ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.