పెద్దపల్లి టౌన్/జూలపల్లి, ఏప్రిల్ 9: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ, మూడేండ్ల కూతురును చంపి, ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన పెద్దపల్లిలో విషాదాన్ని నింపింది. ఎస్ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. జూలపల్లి మండల కేంద్రానికి చెందిన లోక వేణుగోపాల్‌రెడ్డి తన భార్య సాహితీతో కలిసి పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటున్నాడు. వీరికి నాలుగేండ్ల క్రితం వివాహం కాగా, కూతురు రితన్యరెడ్డి(3) ఉన్నది.
వేణుగోపాల్‌రెడ్డి ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాహితీ తన బిడ్డ రితన్యరెడ్డిని చంపి, ఆ తర్వాత ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకున్నది. మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు తరలించి పంచనామా చేశారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉన్నదని, ప్రాథమికంగా అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.