Kottadamrajpalli | మల్లాపూర్, మే 4 : మల్లాపూర్ మండలంలోని కొత్తదాంరాజ్పల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివిన పోలాస ధరణి అనే విద్యార్థినికి ఇటీవల విడుదలైన ఫలితాల్లో పాఠశాల టాపర్ గా నిలిచింది. కాగా ఆమెకు స్థానిక గ్రామసర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి తనకు వచ్చే నెల వేతనాన్ని సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో విద్యా రంగం అభివృద్ధికి తన వంతుగా ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వంశీధర్ రెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్, నాయకులు బద్దం నర్సారెడ్డి, సుధాకర్ రెడ్డి, మామిడి రాజశేఖర రెడ్డి, నిగ రవి, ఎగ్యారపు రాకేష్, బద్దం వెంకట్, సురకంటి సంతోష్, గంగారాజం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.