సైదాపూర్, సెప్టెంబర్ 12: కరీనంగర్ జిల్లా సైదాపూర్ (Saidapur) మండలంలో వర్షం దంచికొట్టింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సైదాపూర్ న్యాల చెరువు, ఆకునూర్ చెరువు, వెంకేపల్లి తుమ్మల చెరువుతో పాటు పలు చెరువులు మత్తడి పారుతున్నాయి. చెరువులో నుంచి నీరు భారీగా నీరు వాగులోకి చేరి ప్రవహిచడంతో సోమారం మోడల్ స్కూల్ జలమయం అయింది. స్కూల్లోని హాస్టల్ విద్యార్థులు అక్కడే ఉండడం తో తల్లితండ్రులు భయందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో తల్లితండ్రులు విద్యార్థినిలను బయటకు తీసుకువచ్చారు. చిన్న వాన పడినా విద్యార్థులు వుండే హాస్టల్, స్కూల్ జలమయం అవుతున్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.