Basara IIIT | చిగురుమామిడి, జూలై 5: చిగురుమామిడి మండలంలోని చిన్నమల్కనూర్ మోడల్ (ఆదర్శ)స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన గౌరవేణి సాత్విక బాసర ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది. మోడల్ స్కూల్లో పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచి ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది.
మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన సాత్విక ట్రిబుల్ ఐటీ కి ఎంపిక కావడం పట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హర్షిత్ కౌర్, ఇందుర్తి గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్కే సిరాజ్, మాజీ జెడ్పీటీసీ అందే స్వామి, లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదే రఘునాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.