Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 21 : జాతీయ విద్యా విధానం నీప్ 2020 ఎడ్యుకేషన్ పాలసీ అమలులో భాగంగా విద్యార్థులకు వృత్తి విద్య నైపుణ్యాలను అందించాలని సంకల్పంతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఎన్ఎస్టీఐ కేంద్రంలో నిర్వహించిన ఐదు రోజుల జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమానికి చిగురుమామిడి మండలం ముల్కనూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హర్షిత్ కౌర్ ఎంపికయ్యారు.
జూన్ 15 నుండి 19 వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిప్ 2020 ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వర్చువల్ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలతో కోర్సులను రూపొందించినట్లు ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్ తెలిపారు. ఐదు రోజు శిక్షణ లో పాఠశాలలో ఒకేషనల్ కోర్సులను అమలు చేస్తున్న తీరు ఆన్ జాబు, ట్రైనింగ్ ఫీల్డ్, విజిట్స్ గెస్ట్ లెక్చరర్ల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను ప్రిన్సిపాల్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శిక్షణకు ఐదుగురు ఎంపిక కాగా, అందులో ముల్కనూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు, మండల ప్రజలు వ్యక్తం చేశారు.