జగిత్యాల, ఏప్రిల్ 15 : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి హాజరుకానున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కవిత దిశానిర్దేశం చేయనున్నారని చెప్పారు. సమావేశానికి జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.