MLC KAVITHA | పెద్దపల్లి, మే30 : ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం మంచిర్యాల జిల్లాకు వెళ్లుతున్న ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం వద్ద బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూల మాల వేశారు.
జై తెలంగాణ… కాంగ్రెస్ తల్లి వద్దు.. తెలంగాణ తల్లి ముద్దు అని నినాదించారు. ఈ కార్యక్రమంలో బండారి శ్రీనివాస్ గౌడ్, దాసరి ఉష, ఉప్పు రాజ్‌కుమార్, పూదరి మహేందర్, లైసెట్టి భిక్షపతి, పెంచాల శ్రీధర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.