కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 27 : కరీంనగర్ వైద్య పితామహుడిగా డాక్టర్ భూంరెడ్డికి పేరు ఉందని, కరీంనగర్‌కే ఒక ల్యాండ్ మార్గా ఆయన పేరు తెచ్చుకున్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. తెలంగాణ మొట్టమొదటి జనరల్ సర్జన్, వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూంరెడ్డికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసం స్థానిక ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు.
ఇటీవల మృతి చెందిన వైద్యుడు భూంరెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం వారి నివాసంలో పరామర్శించారు. అనంత రం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ సుధ, డాక్టర్ రమ, డాక్టర్ రవీందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స చేసిన డాక్టర్ భూం రెడ్డికి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్లో వైద్య సేవలు అందించారని గుర్తు చేశా రు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. ఆనాడు మారుమూల ప్రాం తంగా ఉన్న కరీంనగర్లో యూరాలజీ, న్యూ రో సర్జరీ సేవలను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి చల్మెడ వైద్య కళాశాల స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు.
రేకుర్తి కంటి దవాఖాన, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ, ఐఎంఏలోనూ విశిష్ట సేవలు అం దించారని చెప్పారు. వైద్యరంగంలో ఆయన సాగించిన కృషికి అనేక గోల్డ్ మెడల్స్ అందుకున్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత గాండ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కం సంపత్ కు టుంబ సభ్యులను ఓదార్చి, సంతాపం తెలిపా రు. అంతకు ముందు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న కవిత జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. ఇక్కడ జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, రుద్ర రాధ, జాగృతి నాయకులు ఉన్నారు.