Silver jubilee celebration | రామగిరి, ఏప్రిల్ 23 : ఈ నెల 27 వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులు కదలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సెంటినరీకాలనీ కాలనీలోని కార్మిక క్షేత్రంకు బుధవారం చేరుకుని, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సెక్రటరీ సంపత్ రెడ్డి నివాసంలో ఆయన కూతురు తేజశ్రీరెడ్డికి శశాంత్ రెడ్డితో వివాహం కాగా వారిని కవిత ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
అనంతరం కవిత మాట్లాడుతూ వరంగల్ లో నిర్వహించే సభకు కార్మికులు తండోప తండాలుగా కదిలి వచ్చి సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, నాయకులు కాపుకృష్ణ, పెంట రాజేశ్, మాజీ సర్పంచ్ అల్లం పద్మ, మాజీ వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్, శ్రీకాంతారావు, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, దాసరి మల్లేశ్, కేశవరావు, సురేందర్రావు, క్రాంతి, గాంధీ, శేఖర్, సందీప్, వీరగోని సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.