న్యూస్ నెట్వర్క్, మార్చి 13 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజును ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. నాయకులు, అభిమానులు కేక్‌లు కట్ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే మేడం’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలు నాటారు. అన్నదానాలు చేశారు. దవాఖానల్లో పండ్లు పంచారు. సల్లంగా బతుకు అంటు దీవెనలు అందించారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో ఆమెను కలిసి విషెస్ తెలిపారు.