పెగడపల్లి, జనవరి 1: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని, అభయ హ స్తం ప్రజా పాలన కార్యక్రమం నిరంతం కొనసాగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం బతికపల్లి గ్రామంలో రూ.25 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలు హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వీటి అమలుపై ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు.
వంద రోజుల్లో వీటిని తప్ప ని సరిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తున్నదని, ప్రతి దరఖాస్తును తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. ఈనెల 6వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామ సభలు కొనసాగుతాయని, అనంతరం కూడా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, ఎంపీపీ శోభారాణి, జడ్పీటీసీ రాజేందర్రావు, ఎంపీటీసీలు అనసూర్య, లచ్చ య్య, డీపీవో దేవరాజ్, పీఆర్ ఈఈ రెహమాన్, ఎంపీడీవో పుల్లయ్య, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీవో మహేందర్, ఏఈ శంషేర్‌అలీ, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాములుగౌడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, జనవరి 1: జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లోని శ్రీరాముడి మందిరానికి చేరుకున్న అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం అక్షింతలతో శోభాయాత్రగా వెళ్లి ఇంటింటికీ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్య శ్రీరామమందిర నిర్మాణం జరుగుతోందని, జనవరి 22న జరిగే బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం యావత్ హిందూ సమాజానికి గొప్ప పర్వదినం అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ డాక్టర్ శంకర్, వీహెచ్‌పీ సీనియర్ నాయకుడు డాక్టర్ వెంకట్రాజిరెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పద్మాకర్, మాజీ కౌన్సిలర్లు ఏసీఎస్ రాజు, అరవ లక్ష్మి, అడ్వకేట్ సుబ్రహ్మణ్యం, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్‌రావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేందర్‌రావు, చెన్నాడి మనోహర్‌రెడ్డి, బిట్టు తదితరులు పాల్గొన్నారు.