MLA Vijayaramana Rao | పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 1: పెద్దపల్లి మండలంలోని చీకురాయిలో కొలువైన దుర్గాదేవి అమ్మవారిని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజక వర్గ , పెద్దపల్లి మండల ప్రజల పంటలు బాగా పండి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట పలువురు యూత్ సభ్యులు, గ్రామస్తులు భవాని మాత భక్తులు పాల్గొన్నారు.