MLA Vijaya Ramana Rao | ఓదెల, జూలై 5 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని సాన గొండ, రూపు నారాయణపేట గ్రామాల్లో మృతుల కుటుంబాలను శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత డ్రైవర్ ఆరేల్లి శివాజీ తండ్రి అరెల్లి శంకరయ్య గౌడ్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరణించడంతో శనివారం ఓదెల మండలం శానగొండ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి శంకరయ్య ప్రార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు. రూపు నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఆ కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ లంకా సదయ్య, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సుల్తానాబాద్ సింగిల్ విండో మాజీ చైర్మన్ ఆకుల నరసయ్య, బైరి రవి గౌడ్, అంబాల కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.