పెద్దపల్లి టౌన్, డిసెంబర్ 10: మహిళా సాధికారతే రేవంత్రెడ్డి సర్కారు లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి బస్టాండ్లో మహిళల ఫ్రీ బస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం మహాలక్ష్మి స్కీంకు శ్రీకారంచుట్టిందన్నారు.
ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆడబిడ్డలు, ట్రాన్స్జెండర్స్ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్, నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు యాట దివ్యరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు ఈర్ల స్వరూప, కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, నాయకులు బోడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.