బీఆర్ఎస్ జోష్‌కు ప్రతిపక్షాలు బేజారు
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్ కావాలా? స్కాములు చేసే కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు సూచించారు. మండలంలోని నారాయణపూర్, నాగిరెడ్డిపూర్, లక్ష్మీదేవిపల్లి,
- సంక్షేమం కావాలా? స్కాముల కాంగ్రెస్ కావాలా?
- ఆ పార్టీని నమ్మితే అరిగోస పడుతం
- కడుపులో పెట్టుకుని కాపాడుకునే నాయకుడు సీఎం కేసీఆర్
- బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- గంగాధర మండలంలో ఎన్నికల ప్రచారం
గంగాధర, నవంబర్ 15: ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్ కావాలా? స్కాములు చేసే కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రజలకు సూచించారు. మండలంలోని నారాయణపూర్, నాగిరెడ్డిపూర్, లక్ష్మీదేవిపల్లి, ర్యాలపల్లి, చెర్లపల్లి(ఆర్), లింగంపల్లి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే కర్నాటక రాష్ట్ర రైతుల మాదిరిగా అరిగోస పడుతామని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాత్రి పొలం కాడికి పోవడానికి రైతులు మళ్లీ టార్చిలైట్లు కొనుక్కోవాలన్నారు. ఐదు గ్యారంటీలతో కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందన్నారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతు బంధును బంద్ చేయాలని ఈసీకి లేఖ రాశారని మండిపడ్డారు.
‘జన్‌ధన్ ఖాతా కోలో హమ్ ధన్ ధన్ పంద్రా లాక్ దాలేంగే’ అన్న ప్రధాని మోదీ 15 పైసలు కూడా జమచేయలదేని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి, బీసీ బంధు అందజేస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని కాక్షించే సీఎం కేసీఆర్‌ను మరచిపోవద్దని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జైపాల్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాం మధుకర్, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు ఎండీ నజీర్, పంజాల లక్ష్మి, తాళ్ల విజయలక్ష్మి రవి, తోట పద్మ నాంపెల్లి, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎంపీటీసీలు ఎగుర్ల మల్లమ్మ, ద్యావ మధుసూదన్‌రెడ్డి, అట్ల రాజిరెడ్డి, గంగాధర భాగ్యలక్ష్మి, నాయకులు పంజాల అంజనేయులు, రామిడి సురేందర్, వంగల మల్లికార్జున్, సుంకె నల్ల నరోత్తంరెడ్డి, గర్వంధుల పర్శరాములు, పొన్నం రాములు, అనిల్, మడ్లపెల్లి రమేశ్, వాసాల గంగాధర్, ఇరుగురాల రవి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

