ఊపిరి ఉన్నంత కాలం ప్రజల వెంటే..
‘నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజల వెంటే ఉంటా’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో ఇంటింటి ప్రచారం చేశారు.
- గోపాల్ రావుపేటను మండలం చేస్తా
- అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
- చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి (రామడుగు) నవంబర్22 : ‘నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజల వెంటే ఉంటా’ అని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం రామడుగు మండలంలోని గోపాల్రావుపేటలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తాను స్థానిక బిడ్డనని, అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని, ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను చూసి మోసపోవద్దని సూచించారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడిలాంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
గోపాల్రావుపేట ప్రజల చిరకాల వాంఛ అయిన మండల కేంద్రం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మారొండ కిష్టారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కలిగేటి లక్ష్మణ్, నాగిశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎడవల్లి నరేందర్‌రెడ్డి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ కోడూరి మణెమ్మ – మల్లేశం, కొండగట్టు డైరెక్టర్ దాసరి రాజేందర్‌రెడ్డి, ఎడవల్లి పాపిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు వేల్పుల హరికృష్ణ, మారెట్ కమిటీ డైరెక్టర్లు కొలిపాక మల్లేశం మచ్చ గంగయ్య, మాజీ ఎంపీటీసీ దాసరి లక్ష్మి అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ నేరెళ్ల అంజయ్యగౌడ్, నాయకులు రేణికుంట బసంతం, పైండ్ల శ్రీనివాస్, రేణికుంట అశోక్, రాజిరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, సుద్దాల మల్లేశం, పురాణం రమేశ్, కొలిపాక మల్లయ్య, తిరుపతి, రఘు, దాసరి అనిల్, అల్వాల విష్ణు, అల్వాల శంకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

