గంగాధర, నవంబర్ 18: దళితబంధులో తాను అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తా ను అవినీతికి పాల్పడితే మధురానగర్ చౌరస్తాలో ఆధారాలతో నిరూపించాలని.. లేదంటే ఎన్నికల నుంచి తప్పుకోవాలని మేడిపల్లి సత్యానికి చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు. నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్న తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.
మండలంలోని మధురానగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుంకె రవిశంకర్ మాట్లాడారు. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటనతో బీఆర్ఎస్లో జోష్ వచ్చిందన్నారు. మహిమాన్విత పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయాన్ని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. గంగాధర మ ండలంలోని గర్శకుర్తి, రామడుగు మండలంలోని గోపాల్రావుపేట గ్రామాలను మండల కేంద్రాలు గా ఏర్పాటు చేస్తామనడంపై హర్షం వ్యక్తం చేశారు. పోతారం రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ని ర్మాణం, మద్దట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు.
సీ ఎం కేసీఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రుద్దీన్, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలసంకుల అ నంతరావు, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూ లం బాలగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, కొండగట్టు డైరెక్టర్ ఉప్పుల గంగాధర్, సర్పంచులు వేముల లావణ్యఅంజి, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు అట్ల శేఖర్‌రెడ్డి, రామిడి సురేందర్, ఆకుల మధుసూదన్, మహేశుని ఈశ్వరయ్య, కర్ర బాపురెడ్డి, నారాగరపు సత్యనారాయణ, గునుకొండ బాబు, కర్ర శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ అబ్బాస్, సోకల మల్లేశం, లిం గాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, గుండవేణి తిరుపతి, గంగాధర కుమార్, గంగాధర సంపత్, ద్యావ సంజీవ్, గంగాధర వేణు పాల్గొన్నారు.