కొడిమ్యాల, మే 19 : తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి 21 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలు దద్దరిల్లేలా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండల పరిషత్లో శుక్రవారం ప్రజాప్రతినిధులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ మొక్కవో ని దీక్షతో తెలంగాణ సాధించినట్లు చెప్పారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ఊ హించని విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని, దేశానికే ఆ దర్శంగా నిలించిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు.
ప్రస్తుతం ఏటు చూసినా కాళేశ్వర జలాలు, పచ్చని పంటలు కనిపిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వచ్చే నెల రెండో తేదీ నాటికి దశాబ్దం పూర్తవుతుందని, ఈ సందర్భంగా 2 నుంచి 21 వరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని, ప్రతి ఒక్కరం అందులో భాగస్వాములమవుదాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, వైస్ ఎంపీపీ ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు నాయకులు ఉన్నారు.