తిమ్మాపూర్/ గన్నేరువరం, ఏ ప్రిల్ 19 : ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సమ్మక సారలమ్మ జాతరను తలపించేలా ఉండనున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. శనివారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్, గన్నేరువరం మండలకేంద్రంలో వేర్వేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో ఆయ న మాట్లాడారు. సభకు మానకొండూర్ నియోజకవర్గం నుంచి 10 వేలు, తిమ్మాపూర్ మండలం నుంచి 2 వేలు మందిని తరలిస్తామన్నారు. మొదట ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని కార్యకర్తలకు సూచించారు.
బీఆర్ఎస్ హ యాంలో చేసిన అభివృద్ధి ప్రజలు మర్చిపోవడం లేదని, తమ నాయకుడు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సభకోసం కార్యకర్తలకు రవాణా సౌకర్యం ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం రజతోత్సవ సభ వాల్ పోస్టర్‌ను ఆవిషరించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మం డలాధ్యక్షులు రావుల రమేశ్, గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండల మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగల వీరారె డ్డి, మాతంగి లక్ష్మణ్, పాశం అశోక్ రెడ్డి, అనభేరి రాధాకిషన్ రావు, సంగుపట్ల మల్లేశం, బోయిని కొమురయ్య, లక్ష్మణ్, సుధాకర్, శ్రీనివాస్, ప్రభాకర్ సురేశ్ పాల్గొన్నారు.