Bhoomi Pooja | పాలకుర్తి : పాలకుర్తి మండలం లోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సిమెంట్ రోడ్లు, మురికి కాలువ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. మండలంలోని బసంత్ నగర్, పాలకుర్తి, ఈసాల తక్కలపల్లి, కొత్తపల్లి,రామారావు పల్లె, పుట్నూర్,జయారం, గుడిపల్లి, కుక్కల గూడూర్, వేమునూరు, గ్రామాల్లో డిఎంఎఫ్టి, ఎన్జీఆర్ఎస్ నుంచి 38 కోట్ల 90 లక్షల నిధులతో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులను ప్రారంభించారు. బసంత్ నగర్ లో వారసంత మార్చాలని, పాలకుర్తి, ఈసాల తక్కలపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కులను రేషన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఉంటే సమాచారం ఇవ్వాలని లబ్ధిదారులను ఆదేశించారు. ఈసాలతక్కలపల్లి లోని జేమ్స్ మోడల్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే పాల్గొని గోపిక శ్రీకృష్ణుల వేషధారణలో ఉన్న చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఛైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం తిరుపతి, మక్కాన్సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాగూర్, కాంగ్రెస్ నాయకులు మక్కెర శ్రీనివాస్ గౌడ్, గంగాధరి రమేష్ గౌడ్, సురా సమ్మయ్య, పరిషవేణి శ్రీనివాస్, పాత రవీందర్, తువ్వా సతీశ్ యాదవ్, భోదాసు శంకర్, నారా సత్తయ్య, మాదాసు శ్రావణ్, మల్లెత్తుల శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.