హుజూరాబాద్, జూన్ 15: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు విద్యనందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన చేయాలని కోరారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.