కమాన్చౌరస్తా, జనవరి 30/స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ : సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం జాతరలన్నీ జనసంద్రాల్లా మారాయి.. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారు.

ఉదయం నుంచే వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. రేకుర్తి, కేశవపట్నంతోపాటు గోదావరిఖని, గోలివాడ, నీరుకుల్లలో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు.

పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ‘సల్లంగ సూడు తల్లీ’ అంటూ వనదేవతలను వేడుకున్నారు. కాగా, నేడు తల్లులు జనం వీడి వనంలోకి వెళ్లనున్నాయి.