దవాఖానాల్లో వసతులు కల్పించాలి
ప్రభుత్వ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని సిటీసెంటర్ హాల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక - 90 రోజుల’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ అమృత్ పథకం కింద మంజూరైన రూ.33 కోట్ల నిధులతో పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
- ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్ రూరల్, మే 2 : ప్రభుత్వ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని సిటీసెంటర్ హాల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 90 రోజుల’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ అమృత్ పథకం కింద మంజూరైన రూ.33 కోట్ల నిధులతో పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, ఎంపికలో ఎమ్మెల్యేను భాగస్వామ్యం చేయాలని సూచించారు. కేసీ క్యాంప్‌లోని ఆర్డీవో, ఎంవీఐ, ఎంజేపీ సూల్కు నల్లా కనెక్షన్, డైనేజీ లేకపోవడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వీణవంక మండలంలోని మామిడాలపల్లి-కోరల్, నాగంపేట్, బూజునూర్ రోడ్ల మరమ్మతులు తక్షణమే ప్రారంభించాలన్నారు. ఇల్లంతకుంటలో మకల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలకు మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. కేసీఆర్ కిట్టు పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని, లేదంటే పేరు మార్చి అయినా అమలు చేయాలని కోరారు.
హుజూరాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నేతన్న భద్రత పథకం కింద ఐదు కుటుంబాలకు ఒకొకరికి రూ.5 లక్షల చొప్పున రూ.25 లక్షలు అందజేశారు. ఆర్థిక పునరావాస పథకం కింద 2 కుటుంబాలకు ఒకొకరికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు అందజేశారు. ఏడుగురు అనాథ పిల్లలకు అనాథ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలో ఆర్డీవో రమేశ్‌బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

