MLA Padi Kaushik Reddy | ఇల్లందకుంట, జూలై 12 : నిరుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు మంజూరైన ఇన్స్‌రెన్స్ చెక్కులు, అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల లబ్ధిదారులకు శనివారం వాళ్ల ఇండ్లకు వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజల వైద్యం ఖర్చులకోసం సీఎం చెక్కులను అందిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పావని, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి. మాజీ ఎంపీపీ చుక్క రంజిత్. పిఎసిఎస్ వైస్ చైర్మన్లు కందాల కొమురెల్లి, ఉడుత వీరస్వామి. సర్పంచులు రాజిరెడ్డి, వనమాల, రజిత, మాజీ ఎంపీటీసీలు రామ్ చరణ్ రెడ్డి, ఐలయ్య, విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.