గంగాధర, నవంబర్ 25 : రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా, స్వశక్తి సంఘం మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.
నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మంగళవారం గంగాధర రైతు వేదికలో మంగపేట గ్రామానికి చెందిన నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మండల పార్టీ అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్, నాయకులు దుబ్బాసి బుచ్చయ్య, గంగాధర ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.