చొప్పదండి, జూన్ 19: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగుల పాత్రను గుర్తుచేసి, నోటిఫికేషన్ వరకు గ్రూప్2, 3 పోస్టులను పెంచాలని, డీఎస్సీ పరీక్షలకు మరొక 30 రోజుల గడువు పెంచి కొత్తగా టెట్ పాసైన వారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.