గోదావరిఖని, నవంబర్ 16: గోదావరిఖని చౌరస్తా వద్ద ఈ నెల 18న శనివారం మంత్రి కేటీఆర్ రోడ్‌షోను ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఖనిలోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు కేటీఆర్ రామగుండం కమిషనరేట్‌కు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా గోదావరిఖని చౌరస్తాకు వచ్చి అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలోనే అన్నివర్గాలకు మేలు జరిగిందని పేర్కొన్నారు. మేయర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ రామగుండం అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేయించిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కిందని కొనియాడారు. ఈ నిధులతో గోదావరిఖనిలో పలు జంక్షన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి రామగుండం నుంచి కోరుకంటి చందర్ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, నాయకులు మురళీధర్ రావు, గోపు ఐలయ్య, మాదాసు రాంమ్మూర్తి, చిప్ప రాజేశ్, తోడేటి శంకర్, గుంపుల ఓదెలు, దేవరాజ్, పీటీ స్వామి, రత్నాకర్, మొగిలి, మారుతి పాల్గొన్నారు.