Indiramma beneficiaries | మానకొండూర్ రూరల్, జులై 28: తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో సదాశివపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మీదుగా ప్రొసీడింగ్‌లు, చెక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి విడత కు ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు విడతల్లో డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. నిరుపేద కుటుంబాలు ఇండ్లు నిర్మించుకొనుటకు ప్రభుత్వం వారి ఖాతాలో నగదును జమ చేస్తుందన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందిగిరి రవింద్రాచారి, డివిజన్ నాయకులు ఆకుల ప్రకాష్, మానకొండూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ రామిడి తిరుపతి, మాజీ ఎంపీటీసీ చుక్కా రెడ్డి, నాయకులు మాచెర్ల తిరుపతి, అనంత రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సింగిరెడ్డి మల్లా రెడ్డి, నాయకులు ఆకుల ఉదయ్, బండి మల్లేశం, నాగెల్లి నర్సయ్య పాల్గొన్నారు.