MLA Kaushik Reddy | హుజూరాబాద్ టౌన్, జూన్ 21 : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శనివారం సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అక్రమమని చెప్పారు. కౌశిక్ రెడ్డిపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్నారనే తప్పుడు కేసులు బనాయిస్తోందని పేర్కొన్నారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీలు, 420 హామీలను మరిచిందని, పరిపాలన చేతకాక బీర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని వాపోయారు.
రాష్ట్రంలో అభివృద్ది లేదని ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని, రానున్న రోజుల్లో ప్రజలంతా చైతన్యవంతమై కాంగ్రెస్ ను భూ స్తాపితం చేస్తారని మండిపడ్డారు. కేసులు పెట్టినా.. అరెస్టులు చేసినా.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.