BRS | రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
మ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
హుజురాబాద్, జూన్ 10 : రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హజురాబాద్ మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జూపాక సింగిల్ విండో చైర్మన్ అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి ఉప సర్పంచ్ శనిగరం అయిలయ్య, వార్డు సభ్యులు బిజెపి బూత్ అధ్యక్షుడు ఈర్ల రాజు, నాయకులు ఈర్ల ప్రవీణ్, మునిగాల పోచయ్య, శనిగరపు సమ్మయ్య, నోముల కరుణాకర్, పత్తి శ్రీనివాస్ రెడ్డి, శనిగరపు రవి, కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షుడు ఎండీ రమీజ్, రాజపల్లి సోషల్ మీడియా కాంగ్రెస్ ఇంచార్జ్ చెవుల సాయి కుమార్ తదితరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కు గ్రామ గ్రామాన విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తోందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత శక్తివంతంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

