జగిత్యాల రూరల్, డిసెంబర్ 21: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో రూ.10 లక్షల నిధులతో సద్గురు శ్రీ సంత్ సేవలాల్ మహరాజ్ బంజారా భవన్ నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బంజారా భవన్ నిర్మాణానికి గతంలో రూ.10 లక్షలు, ప్రస్తుతం మరో రూ.10లక్షలు కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రంథాలయాల అభివృద్ధి సాధ్యమైందని, రూ.2 కోట్లతో నూతన గ్రంథాలయం నిర్మాణం చేపట్టామని, రాయికల్ పట్టణంలో రూ.30 లక్షలతో నూతన గ్రంథాలయం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్ర శేఖర్ గౌడ్, డీటీవో శ్యామ్ నాయక్, బంజారా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భూక్యా గోవింద్ నాయక్, ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ నునావత్ దేవదాస్నాయక్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాజు, ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పీటీవ్ అశ్విని జాదవ్, దశరథ్ నాయక్, భూక్యా లావణ్య-గంగాధర్, నగావత్ బాలునాయక్, ప్రకాశ్‌నాయక్, ప్రవీణ్, మురళి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల్లోని గ్రామ పంచాయతీల నూతన భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను తన క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాల సర్పంచుల ఫోరం కార్యవర్గ సభ్యులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెరుకు జాన్, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రాయికల్, డిసెంబర్ 21: రాయికల్ మండల కురుమపల్లి గ్రామ పంచాయతీకి నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు కాగా పాలక వర్గ సభ్యులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
జగిత్యాల రూరల్, డిసెంబర్ 21: జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన జాగిరి గంగరాజం అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బుధవారం పరామర్శించారు. అలాగే పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ నవ్వోతు రవి తల్లి ఎర్ర గంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు దాసు, రామ్మోహన్ రావు, తదితరులున్నారు.