జగిత్యాల టౌన్, జనవరి 12: అలిశెట్టి రచనలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కీర్తించారు. అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలోని అంగడిబజార్లోని అలిశెట్టి విగ్రహానికి జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు.
అలిశెట్టి ప్రభాకర్ రచనలు, కవిత్తం, ఫొటోలు సమాజ నిర్మాణానికి అవసరమన్నారు. బీఆర్ఎస్ పక్షాన వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. గతంలోనే డబుల్ బెడ్రూం ఇల్లు కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ అనిల్‌బాబు, డీఈ రాజేశ్వర్, నాయకులు బాలె శంకర్, వల్లెపు మొగిలి, తాండ్ర సుధీర్, గౌరి శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్, వేణుమాధవ్, పెండెం గంగాధర్, శేఖర్, కత్రోజ్ గిరి, శేఖర్, మహేశ్ ఉన్నారు.