ఇల్లంతకుంట, నవంబర్ 10: ‘నా కోసం ఈ 20రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్తం. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని చూసి పని చేసేవారికే పట్టంకట్టండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, రంగంపేట, రహీంఖాన్ పేట, వెల్జీపూర్, ఓగులాపూర్, గూడెప్పల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ఇం టింటా ప్రచారం చేశారు. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రంగంపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతోపాటు అభివృద్ధిని పరుగులు పెట్టించామని చె ప్పారు.
‘బిడ్డా నువ్వే మళ్లీ గెలుస్తవ్’ అంటూ రంగంపేటలో ఓ వృద్ధురాలు దీవించడంతో సంతోషం వ్యక్తం చేశారు. తాను గెలిచిన తర్వాత కందికట్కూర్‌లో ఎల్లమ్మ ఆలయం రోడ్డులో నూతన బ్రిడ్జి, బీరప్ప ఒర్రెపై నూతన బ్రిడ్జి నిర్మిస్తామనని హామీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మ న్ సిద్ధం వేణు, రాష్ట్ర నాయకుడు దరువు ఎల్ల న్న, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రొండ్ల తిరుపతిరెడ్డి, అన్నాడి అనంతరెడ్డి, వైస్‌ఎంపీపీ సుధగోని శ్రీనాథ్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతపల్లి వేణురావు, సర్పంచులు ముత్యం అమర్గౌ డ్, బిల్లవేని పరశురాం, వజ్రవ్వ, ఉడుతల రజి త, గట్ల మల్లారెడ్డి, ఎరవెల్లి మల్లవ్వ, ఎంపీటీసీ లు ఒగ్గ నర్సయ్య, గొట్టెపర్తి పరశురాం, ముత్యంరెడ్డి, నేతలు యాస తిరుపతి, తూటి పరశురాం, పెద్ది రాజు, ఉడుతల వెంకన్న, సంతోష్‌రెడ్డి, గడ్డమీది మల్లయ్య, ఆరె కొమురయ్య పాల్గొన్నారు