ప్రజా తీర్పును శిరసావహిస్తాం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ను శిరసావహిస్తున్నామని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు
- పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి (నమస్తేతెలంగాణ)/ పెద్దపల్లి, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ను శిరసావహిస్తున్నామని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నిరంతరం పని చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రేమతో ఓటేసి ఆశీర్వదించిన 63 వేలమంది ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సాధారణ కార్యకర్తగా బీఆర్ఎస్లో చేరిన తనకు పార్టీ అవకాశం ఇచ్చిందని, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వడం ఈ జన్మలో మర్చిపోలేనన్నారు.
పదేళ్లుగా బీఆర్ఎస్ కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా తనను ఆదరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలిపారు. రెండుసార్లు తనకు ఎమ్మెల్యేగా, పార్టీకి అధికారం ఇచ్చిన పెద్దపల్లి ని యోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పదేండ్లపాటు తనకు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సహకరించిన ప్రజలకు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మెన్లు, మార్కెట్మిటీ ఛైర్మెన్లు, వైస్ ఛైర్మెన్లు, డైరెక్టర్లు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు,
మండల రైతు కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు , డైరెక్టర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధు లు, బీఆర్ఎస్ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

