పెద్దపల్లి, మే3: ఆర్య వైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడిగా మంచాల వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, బుధవారం ఎమ్మెల్యేను తన నివాసంలో మర్యాదపూర్వకంగా ఆర్యవైశ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపి సతరించారు.
అనంతరం మాట్లాడారు. ఆర్యవైశ్యులతో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు. గత రెండు పర్యాయాలు తనకు సంఘం అండగా నిలిచారని, రాబోయే రోజుల్లో సహకరించాలని కోరారు. ఇక్కడ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు నార్ల నాగభూషణం, అల్లంకి రామన్న, ఎన్ దక్షిణామూర్తి, కోలేటి రమేశ్, తొడుపునూరి వెంకటేశం, రవీందర్, వెంకట్ నారాయణ, రాజన్న, వినోద్ కుమార్, రవి, వెంకటేశ్, రాజేందర్, నవీన్ ఉన్నారు.