కారుకు ఓటేస్తేనే మరింత అభివృద్ధి
కారుకు ఓటేస్తేనే మరింత అభివృద్ధి సాధ్యం..గులాబీ జెండాయే నిరుపేదలకు అండ’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా తన గెలుపు ఖాయమని ఎమ్మె ల్యే ధీమా వ్యక్తం చేశారు.
- గులాబీ జెండా..పేదలకు అండ
- ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే విజయం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
- పెద్దపల్లి మండలంలో విస్తృత ప్రచారం
పెద్దపల్లి కమాన్, నవంబర్ 18: కారుకు ఓటేస్తేనే మరింత అభివృద్ధి సాధ్యం..గులాబీ జెండాయే నిరుపేదలకు అండ’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా తన గెలుపు ఖాయమని ఎమ్మె ల్యే ధీమా వ్యక్తం చేశారు. శనివారం పెద్దపల్లి మండ లం రాఘవాపూర్, గుర్రాంపల్లి, మారేడుగొండ, హనుమంతునిపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయాచోట్ల దాసరికి మహిళలు, కార్యకర్తలు మంగళహారతులు ఇచ్చి, పూలుజల్లుతూ ఘన స్వాగ తం పలికారు. రాఘవాపూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.
గత పాలకులకు స్వప్రయోజనాల కోసం పని చేశారని విమర్శించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాధీ ముబారక్, దళితబంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్లు ఇలా ఎన్నో స్కీంలను అమలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే మహిళలకు ప్రతి నెలా రూ. 3వేలు అందిస్తామని, రూ. 400 గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్లు రూ. 5వేలు, దివ్యాంగుల ఫించన్ రూ. 6వే లు, రైతుబంధు రూ. 16 వేలు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ. 15లక్షల వరకు పెంచుతామని తెలిపారు.
రేషన్ కార్డులందరికీ సన్నబియ్యం ఇస్తామని, రూ. 5లక్షల బీమా వర్తింపజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను అసెంబ్లీకి పంపించాలని కోరారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు సీ సత్యనారాయణరెడ్డి, వేముల రామ్మూర్తి, ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్, బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కొయ్యడ సతీశ్, మండల పార్టీ అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్, నాయకులు తాడిశెట్టి శ్రీకాంత్, రామస్వామి, అంతగిరి కొమురయ్య, గాండ్ల సదయ్య, పాల చంద్రయ్య, గుంటి రమేశ్, రమేశ్, జనగామ సదయ్య, వొడ్నాల శంకరయ్య, కల్లెపల్లి సదయ్య, రవి, దూలం సతీశ్, కోనేటి సదయ్య, తాడిశెట్టి సదయ్య, కొడపత్రి శ్రీఇవాస్, సందీప్, ఏనుగుల మల్లయ్య, సదయ్య, కుంట శివకుమార్, మదిరె మల్లయ్య, పొలవేన కొమురయ్య, బొడ్డు మల్లయ్య, కాసుల సతీశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

