కేసీఆర్ సభకు కదిలిరండి
పెద్దపల్లి జూనియర్ కళాశాల గ్రౌండ్లో మంగళవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు నియోజకవర్గ ప్రజలు పెద్దసంఖ్యలో కదిలిరావాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
- నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్చార్జి రవీందర్‌సింగ్‌తో కలిసి ఏర్పాట్ల పరిశీలన
పెద్దపల్లి, నవంబర్ 6: పెద్దపల్లి జూనియర్ కళాశాల గ్రౌండ్లో మంగళవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు నియోజకవర్గ ప్రజలు పెద్దసంఖ్యలో కదిలిరావాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఏర్పాటుతో పాటు అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులిచ్చిన ప్రగతి ప్రదాత సభను విజయవంతం చేసి కృతజ్ఞత చాటాలని కోరారు. సోమవారం సభాస్థలాలి వద్ద పెద్దపల్లి బీఆర్ఎస్ ఇన్చార్జి సర్ధార్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు.
నియోజకవర్గంలోని 6 మండలాలు, 2 పట్టణాల్లోని ప్రజలు హాజరుకావాలని విజ్ఞప్తిచేశారు. పార్టీ నాయకులు ప్రజలందరూ మధ్యాహ్నం 3 గంటల్లోపే సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థలాల్లోనే వాహనాలను నిలుపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానామొబిన్, బీఆర్ఎస్ పట్టణాధ్యాక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, కౌన్సిలర్లు, నాయకులు పూదరి చంద్రశేఖర్, పైడ రవి పద్మ, లైశెట్టి భిక్షపతి, గాదే మాధవి, పస్తం హన్మంతు, దేవనంది రమాదేవి, రమాదేవి శ్రీధ ర్, పెద్ద గీతాంజలి వెంకటేశ్, వునుకొండ సుజాత సునీల్, ఫహీం, జావిద్, తజ్రేజ్, చొప్పరి వంశీ, గండు రంగయ్య, తాళ్ల కల్యాణ్, కుక్క కనకరాజు, కమ టం శ్రీధర్, కాసుపాక వాసు, బొడ్డుపల్లి రమేష్, పూర్ణాచారి, చంద్రశేఖర్, మధు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

