Manthani | రామగిరి, ఏప్రిల్ 21: మంథని నియోజకవర్గం కాంగ్రెస్ లో ఎన్నడూ వినని, చూడని ఆ పార్టీ లో ఏక ఛత్రాధిపత్యం మాత్రమే కొన్నేళ్లు గా కొనసాగుతున్న నైపథ్యం. ఆ పార్టీ లో కీలకంగా ఉన్న నాయకులు ఇద్దరూ ఉద్ధండులే. వారసత్వ పరంగా రాజకీయంగా ఎదిగిన ప్రజా ప్రతినిధులు వీరు. వీరి మధ్యన విబేధాలు తారాస్థాయికి చేరాయి.
ఆ పార్టీలో ని కార్యకర్తలు అయోమయమవుతున్నారు. ఈ నిజాలు ఇటీవల జరిగిన కొన్ని కార్యమాలే ఇందుకు నిదర్శంగా నిలుస్తున్నాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు అంబేద్కర్ జయంతి సాక్షిగా బట్టబయలు అయ్యాయి. ఇప్పటికే అధికార కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దళిత ఎంపీని అవమానాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు మంథనిలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపీకి కలువనీయకుండా కట్టడి చేశారు.
కాగా ఎంపీ కాకా వెంకటస్వామి, తన తండ్రి వివేక్ ఫొటోలతో కలిపి సోమవారం అర్జీ-3 జీ ఎం ఆఫీస్ కు సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎవరో గుర్తు తెలియని వారు కూల్చేయడంతో సొంత పార్టీ వారే కూల్చినట్లు భావించి ఎంపీ, మంత్రిల మద్య వర్గవిభేదాలు మాత్రం గుప్పుమంటున్నాయి. దీనితో పెద్దపల్లి ఎంపీ, మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మధ్యన గల విబేధాలు బహిర్గతం అయినట్లు ఇవి ఉహించినవెనని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.