Sagara Sangam | వీణవంక : తెలంగాణ రాష్ర్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల అవార్డు బహుమతుల ప్రధాన ఉత్సవం నిర్వహించారు. కాగా వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన పొట్ల శ్రీ వెస్ట్రన్ డాన్సు విభాగంలో ప్రతిభ కనబర్చింది. కాగా ఆ చిన్నారి ప్రత్యేక బహుమతికి ఎంపిక కాగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆమెకు మెడల్‌తో పాటు సర్టిఫికెట్, షీల్డు, నగదు బహుమతి అందజేశారు.
అలాగే జిల్లాకు చెందిన పలువురికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదబుద్దుల సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర, రాష్ర్ట మహిళా విభాగం అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి సగర, జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టరాజు సగర, నాయకులు మార్క సురేష్, ఉప్పరి మహేందర్ సగర, గారు,. శ్రీ సాయి గణేష్ సగర, కానిగంటి శ్రీనివాస్ సగరతో పాటు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.