చిగురుమామిడి, మే 6 : మండలంలోని సుందరగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఆలయ అధికారులతో కలిసి మంగళవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గుర్తింపు పొందిందన్నారు. భక్తుల కోరికలను తీర్చే కొలువైన ఆలయంగా పేరుందన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున భక్తులకు బ్రహ్మోత్సవాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర వసతులు కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. ఈనెల 8 నుండి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 12న కళ్యాణం, 15న బండ్లు తిరుగుట, 16న రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో రాజకుమార్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఈవో రాజకుమార్, సీనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత, ఆలయ పూజారి శేషం నవీనాచార్యులు తదితరులు ఉన్నారు.