– బీర్ల అమర్, ఉప్పల్
ఇంటిని కట్ చేయడం అనే పద్ధతి నిజానికి శాస్త్రంలో లేదు. మన ఇల్లు అందరికన్నా భిన్నంగా, వినూత్నంగా కనిపించాలన్న ఆలోచనతో.. ఇంటికి నానా రకాల సర్జరీలు చేస్తున్నారు. ఉదాహరణకు విశాలమైన స్కూల్ భవనం, ధర్మ సత్ర ప్రాంగణం నిర్మించే సందర్భంలో దాని వెంటిలేషన్ కోసం వివిధ రకాలుగా నిర్మాణంలో మార్పులు తెస్తారు కదా! సొంత ఇంటికి కూడా చక్కని ప్రాకారం, చుట్టూ ఖాళీ ఆవరణం వదిలి నిర్మిస్తే అది అనేక ఆరోగ్య-ఐశ్వర్యాలను అందిస్తుంది. ఇంటిని కట్ చేయాల్సి వస్తే దక్షిణం, పడమరలో కట్ చేయవచ్చు. ఆ కట్ అనేది ఇంటి గర్భస్థానాన్ని తెంపుచేయకుండా.. సరిగ్గా దక్షిణం మధ్యలో మూడో భాగం తెంపు చేయాలి. కొలతను బట్టి ఎక్కువ లోతు వెళ్లకుండా జాగ్రత్తగా చేయండి.
– పల్లె గిరిజ, కొడంగల్
గృహంలో మెట్లు వచ్చినప్పుడు ల్యాండింగ్ కింది భాగంలో టాయిలెట్ కట్టుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఫ్లోరింగ్ ఎత్తు. మెట్ల ల్యాండింగ్ కనీసం ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్నపుడు దానికింద టాయిలెట్ వస్తుంది. అక్కడ కాకుండా ఆ మెట్లకిందనే బెడ్రూంను ఆనుకొని మెట్ల రేజర్ కింద అవసరమైన ఎత్తు చూసుకొని టాయిలెట్ వేసుకోవచ్చు.

ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోని మెట్లకింద ఎత్తు సరిపోవడం లేదని గ్రౌండ్ కిందికి దించి టాయిలెట్ కట్టకూడదు. అది దోషమవుతుంది. ఇంట్లో దక్షిణం, పశ్చిమం ఫ్లోరింగ్ పల్లం కాకుండా చూడాలి. మెట్లకిందకు మనిషి వెళ్లే అవకాశం లేనప్పుడు అక్కడ టాయిలెట్ కాకుండా స్టోర్ గదిని కట్టుకోవచ్చు. దక్షిణం-పడమర దిక్కుల్లో మెట్లు వచ్చినా ఇదే విధానం అనుసరించాలి.
– సోమకుమార్, జగిత్యాల
ఇంట్లో ఒకటి లేదా మూడు బెడ్రూములు ఉంటాయి. మీరు చెప్పేది మాస్టర్ నైరుతి పడకగది గురించే అయితే.. ఆ గదికి ఎలాంటి పడమర, దక్షిణం, వాయవ్యం దిక్కుల్లో డోర్లు పెట్టి వాడకూడదు. ఆ గదికి ఒకటే ఆగమన, నిష్క్రమణ ద్వారం ఉండాలి.

అది ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్య వాయవ్యంలోని పడకగదిని.. పశ్చిమ వాయవ్యంలో ద్వారం పెట్టుకొని, వెనుక ఉన్న బాల్కనీకి వెళ్లవచ్చు. ఇంట్లో ఏ గదులను ఎలా వాడాలి అన్న విషయం తెలుసుండాలి. ఇంటి మొత్తాన్ని లెక్కించి చూసినప్పుడు గదులకు ఆయా దిశలను బట్టి ప్రాధాన్యాలు ఏర్పడతాయి. మాస్టర్ బెడ్రూమును చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాలి. దాని విశ్రాంతి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయకూడదు.
– కావుల శ్రీలత, బొందుగుల
ప్రస్తుతం కొంతమంది మాస్టర్ బెడ్రూములలో రెండు మరుగుదొడ్లను పెట్టుకుంటున్నారు. ఇంట్లోని ఒక గదిలో సరైన విధంగా ఒక టాయిలెట్ అమర్చుకుంటే చాలు. కానీ, ఇప్పుడంతా భార్యాభర్తలు వేరువేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు మరుగుదొడ్లు ఇంట్లో ఉండేవి కాదు. వృద్ధులు రాత్రుళ్లు నడవలేరని.. అది కాస్తా ఇంట్లోకి వచ్చింది.

కానీ, అది నేడు ఒకటి నుంచి రెండుగా మారింది. అనవసరంగా గది వాతావరణం చెడగొట్టకుండా టాయిలెట్ నిర్మాణం చేయాలి. మీరు రెండిటినీ ఉత్తరంలోని వాయవ్యంలో వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. తలుపు వేసుకుంటే బెడ్‌కు ఇబ్బంది కాకుండా బెడ్రూమును పెద్దగా ఏర్పాటు చేసుకొని.. డ్రెస్సింగ్ తరువాత ఆగ్నేయం లేదా వాయవ్యంలో సరైన విభజనతో కట్టాలి. ఆరోగ్యం విషయంలో టాయిలెట్ కారణం కాకుండా అన్నీ చూసుకొని దాన్ని రూపొందించుకోవాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143