కమాన్‌చౌరస్తా, జనవరి 21: పదో తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఆదివారం ఆయన ఆవిషరించి మాట్లాడారు. త్వరలో ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీవిడపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నలుమాసు సుదర్శనం, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఏనుగు ప్రభాకర్ రావు, జిల్లా కోశాధికారి పులి అశోక్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పాము మోహన్, హెడ్ క్వార్టర్ సెక్రటరీ మియాపురం మధుసూదనాచారి, ఉపాధ్యక్షుడు దేవ శంకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ దీక్షితులు, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, రేవెల్లి రాజయ్య, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.
చిగురుమామిడి జనవరి 21: నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నవాబ్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఆదివారం జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ప్రజలకు సమస్యలు ఉంటే నియోజకవర్గ కార్యాలయంలో తనను సంప్రదించాలని కోరారు. మంత్రి వెంట జడ్పీటీసీ గీకురు రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్‌కుమార్, చింతపూల నరేందర్, నరేందర్ రెడ్డి తదితరులున్నారు.